ఏపీ పంచాయితీ ఎ‌లెక్ష‌న్స్‌.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్‌!

January 27, 2021 at 8:11 am

హైకోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌డంతో.. ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల సంద‌డి ఊపందుకుంది. మ‌రోవైపు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్ప‌టికే పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్ కూడా విడుద‌ల చేశాడు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు.

అయితే ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. రాష్ట్రంలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏగ్రీవాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది.గ్రామాల్లో మంచి వాతావరణం నెలకొల్పేందుకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేర‌కు జీవో కూడా జారీ చేసింది.

దీని ప్ర‌కారం.. పంచాయతీ జనాభాను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 2 వేల లోపు జనాభా ఉంటే రూ.5 లక్షలు, 5 వేల వరకు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల వరకు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేల జనాభా దాటితే రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం వెల్లడించింది.

ఏపీ పంచాయితీ ఎ‌లెక్ష‌న్స్‌.. బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts