
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికర నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా ఏపీ తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. శనివారం ఉదయం విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ సందర్భంగా రహేష్ కుమార్ మాట్లాడుతూ.. మొత్తం 68 డివిజన్లలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్టు ప్రకటించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్ తో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలయ్యాక.. సుప్రీంకోర్టు కూడా ఆపలేదని నిపుణులు చెబుతున్నారు.
అదే జరిగితే.. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘాల నాయకులు మరియు ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం.. ఈ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో జరిగేలా లేవని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి..
జనవరి 23 నోటిఫికేషన్ జారీ
జనవరి 25 అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ప్రారంభం.
జనవరి 27 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 28 నామినేషన్ల పరిశీలన
జనవరి 29 అభ్యంతరాల పరిశీలన
జనవరి 30న అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి 31 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
జనవరి 31 మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5 పోలింగ్ తేదీ (ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30), ఇదే రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక.