కరోనా వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ టాప్!

January 17, 2021 at 2:07 pm

కోవిడ్ టెస్టులు నిర్వహించడంలో దేశంలోనే టాప్ లిస్ట్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్. జనాభా ప్రతిపాదిక కింద ఇప్పటివరకు నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందడుగులో ఉంది. అంతేకాదు రికవరీల్లోనూ ఏపీనే మొదటి స్థానంలో ఉంది. ఏపీలో కోవిడ్ రికవరీ రేటు 99 శాతం ఉంది. ఏపీలో ఒక్క రోజుకు దాదాపు లక్ష వరకు కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ లోనూ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లో ఉన్నట్టు తెలిసింది. తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ ఏపీలో చాలా విజయవంతమైంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. దేశ వ్యాప్తంగా తొలి రోజు లక్షా 95 వేల మందికి పైగా కోవిడ్ టీకాలు వేశారు. ఏపీలో తొలి రోజే 19 వేల108 మందికి టీకా వేశారు.

అంటే దేశంలో వేసిన మొత్తం కోవిడ్ టీకాల్లో దాదాపు 10 శాతం ఒక్క ఆంధ్రపదేశ్ లో వేశారు. జనాభా లెక్కల ప్రకారం తొలి రోజు ఎక్కువ మందికి టీకా వేసిన రాష్ట్రాల్లో ఏపీనే టాప్ లో నిలిచింది. మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం తొలి రోజు 4 వేలకు పైగా కోవిడ్ టీకాలు వేశారు. ఇదే కాకుండా చాలా రాష్ట్రంలో ఆదివారం నాడు కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించడం లేదు. కాని ఏపీలో మాత్రం 332 కేంద్రాల్లో రెండో రోజు ఆదివారం కూడా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతుంది. ఏపీలో తొలి దశలో మొత్తం 332 కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఏపీకి మొత్తం 4.96 లక్షల డోసుల వ్యాక్సిన్ వచ్చింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రీగా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందస్తుగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు జిల్లాల్లోనే మాత్రమే డ్రైరన్ చేపట్టగా ఒక్క ఏపీలో మాత్రం అన్ని జిల్లాల్లో డ్రై రన్ నిర్వహించారు.

కరోనా వ్యాక్సినేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ టాప్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts