ఆలోచించేలా చేస్తున్న అర్థ శ‌తాబ్దం మూవీ టీజర్..!!

January 27, 2021 at 2:47 pm

కేరాఫ్ కంచెర‌పాలెం చిత్రం ఫేం కార్తీక్ ర‌త్నం, న‌వీన్‌చంద్ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సినిమా అర్థ శ‌తాబ్దం. ఈ చిత్రానికి ర‌వీంద్ర పుల్లె ద‌ర్శ‌క‌త్వం వహిస్తునాడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ రిలీజ్ చేశారు. టీజర్ లో సీరియ‌స్ బ్యాక్ డ్రాప్ వాయిస్ ఓవ‌ర్ తో వ‌చ్చే మాటలు చాలా స‌స్పెన్స్ గా సాగుతూ మూవీ పై మరింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

న్యాయం ధ‌ర్మం అవుతుంది కానీ ధ‌ర్మం ఎల్ల‌ప్పుడూ న్యాయం కాదు. యుద్ధ‌మే ధ‌ర్మం కాన‌ప్పుడు ధ‌ర్మ‌యుద్దాలెక్క‌డివి. ఈ స్వ‌తంత్ర దేశంలో గ‌ణ‌తంత్రం ఎవ‌డికో, ఎందుకో అంటూ సాగే సంభాషణలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఎస్ క్రియేష‌న్స్ 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సుహాస్‌, శుభ‌లేక సుధాక‌ర్ సాయి కుమార్‌, రాజా ర‌వీంద్ర, కృష్ణ ప్రియ, ఆమ‌ని తదితరులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఆలోచించేలా చేస్తున్న అర్థ శ‌తాబ్దం మూవీ టీజర్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts