గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా.. !

January 22, 2021 at 1:59 pm

బిగ్ బాస్ షోకు వెళ్లక ముందు నుండి యాంక‌ర్‌గా వ్యవహరించిన అరియానా అంత పెద్ద గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి అడుగుపెట్టినప్పటి నుండి ఈ భామ క్రేజ్ బాగా పెరిగింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ తన డైన శైలిలో దూసుకెళ్లిన అరియానా బిగ్ బాస్ లో టాప్ 5లో నిలిచింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన అరియానాకు ఇప్పుడు చాలా ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు వినికిడి.

అరియానా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచి కబురు చెప్పింది. హీరో రాజ్ త‌రుణ్, ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్ తో దిగిన ఒక పిక్ ని షేర్ చేస్తూ త్వ‌ర‌లో ఎగ్జైటింగ్ న్యూస్ రానుంది. బిగ్ బాస్ త‌ర్వాత ఇదీ నా జీవితంలో మంచి రోజు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతూ రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్ అంటూ కామెంట్ చేసింది . అలానే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌ ‌ని కూడా హ్యాష్ ట్యాగ్‌తో జ‌త చేసింది. ఇది చూస్తుంటే అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో హీరో రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న అరియానా ఒక మూవీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఇందులో అరియానా ఎలాంటి పాత్ర చేస్తుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా.. !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts