
అరవింద్ స్వామి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి.. అరవింద్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మణిరత్నం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరవింద్.. `రోజా` సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాధించుకున్నాడు.
ఇక ఆ తర్వాత `బొంబాయి` సినిమా కూడా హిట్ అవ్వడంతో.. అరవింద్‌కు ఎనలేని క్రేజ్ దక్కింది. అయితే కారణం ఏంటో తెలియదు గాని.. క్రమంగా వరుస ఫ్లాప్స్‌నే ఎదుర్కొంటూ వచ్చాడు అరవింద్. దీంతో చివరకు సినిమాలకు దూరమైన అరవింద్.. బిజినెస్ ప్రారంభించి సక్సెస్ అయ్యాడు. ఇక చాలా ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అరవింద్.. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. తెలుగులో `ధృవ` సినిమాతో స్టైలిష్ విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్.. హీరో రామ్ చరణ్‌తో పోటాపోటీగా నటించి ఆకట్టుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన సైకిల్ దొంగగా మారాడు. అవును, ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. తాజాగా ట్విట్టర్ ఓ ఫొటో షేర్ చేసిన అరవింద్.. సైకిల్ దొంగలు అంటూ ఫన్సీ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఇక ఈ ఫొటోలు అరవింద్ సైకిల్ తొక్కుతుంటే.. ఆయన కూతురు అధిర స్వామి ముందు కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటో వైరల్ కావడంతో.. నెటిజన్లు అరవింద్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా అని షాక్ అవుతున్నారు.
Bicycle thieves ! 😊❤️ pic.twitter.com/cyCIcMtJMb
— arvind swami (@thearvindswami) January 24, 2021