సంక్రాంతికి మిస్ అయినా.. ఆ పండ‌గ‌కు వ‌స్తానంటున్న బాల‌య్య‌!

January 18, 2021 at 9:11 am

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ముచ్చ‌ట‌గా మూడోసారి `బిబి3` పేరిట ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి మంచి విజయాల తర్వాత మ‌ళ్లీ వీరి కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

కోవిడ్‌ ప్రభావానికి ముందే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోవిడ్‌ తర్వాత ఇటీవల షూటింగ్‌ను పునః ప్రారంభించుకుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఓ కీలక పాత్రలో హీరోయిన్‌ పూర్ణ నటిస్తుంది. ఇక క‌రోనా లేకుండా ఉంటే.. ఈ చిత్రం సంక్రాంతికి వ‌స్తుంద‌ని నంద‌మూరి అభిమానులు భావించారు.

కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. సంక్రాంతికి మిస్ అయిన బాల‌య్య‌.. ఉగాది పండ‌గ‌కు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడ‌ట‌. అవును, ఈ సినిమా ఉగాది స్పెషల్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రానికి `మోనార్క్‌` అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసిన‌ట్ట టాక్‌.

సంక్రాంతికి మిస్ అయినా.. ఆ పండ‌గ‌కు వ‌స్తానంటున్న బాల‌య్య‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts