ఆ వంట‌కం అంటే ప‌వ‌న్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌!

January 25, 2021 at 7:46 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌కీయాల కార‌ణంగా రేండేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ఈయ‌న మ‌ళ్లీ వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అంతేకాదు, వ‌రుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటూ.. జోరు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంతో పాటు `అయ్యప్పనుమ్ కోషియమ్` తెలుగు రీమేక్ కూడా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.

ఇక ఇటు సినిమాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్‌.. మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏపీలో పంచాతీయ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌ల అవ్వ‌డంతో.. పవన్ కల్యాణ్ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ విష‌యాల‌న్నీ ప‌క్కన పెడితే.. ప‌వన్‌కు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ సినిమాలు, రాజ‌కీయల విష‌య‌మే తెలుసుకున్నారు కానీ.. ఇంతకీ ఆయ‌న‌కి ఇష్టమైన వంటకం ఏదో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? పవన్‌కు అరటికాయ వేపుడంటే పిచ్చ ఇష్ట‌మ‌ట‌. దాని ముందు చికెన్‌ బిర్యానీ పెట్టినా పట్టించుకోర‌ట‌. పవన్ ఎంతో ఇష్టంగా తినే వంట్లో అర‌టికాయ వేపుడుదే మొద‌టి స్థాన‌మ‌ట‌.

ఆ వంట‌కం అంటే ప‌వ‌న్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts