
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేష్, అను ఎమాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 14న విడుదలై.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ శ్రీనివాస్.. టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్ బాబు గ్రేట్ యాక్టర్ అని, ఎన్టీఆర్ గ్రేట్ ఆర్టిస్ట్ అని తెలిపారు. ఇక ఎన్టీఆర్ ఆర్టిస్ట్ అని ఎందుకు అంటే.. అతడు అన్ని చేయగలడు, గొప్ప యాక్టర్, గొప్ప డ్యాన్సర్, గొప్ప ఫైటర్ అని బెల్లంకొండ ప్రశంసలు కురిపించారు.
అలాగే అల్లు అర్జున్ మల్టీ టాలెంటెడ్ అని.. ప్రభాస్ గొప్ప పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అని, ఆయనలో ఒక ఔరా ఉంటుందని బెల్లంకొండ చెప్పుకొచ్చాడు. ఇక బెల్లంకొండ చేసిన వ్యాఖ్యలు.. ఆయా హీరోల అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. కాగా, బెల్లంకొండ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వచ్చిన `ఛత్రపతి` హందీ రీమేక్ కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రంతోనే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కూడా.