బిగ్ బాస్ కంటెస్టెంట్ కి అమెరికా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్…!?

January 20, 2021 at 2:52 pm

రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4లో పాల్గొని క్రేజ్ సంపాదించుకున్న వారిలో సొహైల్ కూడా ఒక‌డు. మాములు కంటెస్టెంట్‌గానే లోప‌లికి వెళ్లిన సొహైల్ టాప్ 5వ‌ర‌కు చేరుకున్నాడు. షోలో సోహైల్ బిహేవియ‌ర్ బ‌య‌ట చాలా మందికి న‌చ్చింది. ఇంకా ముఖ్యంగా క‌థ వేరే ఉంటుంది, సింగ‌రేణి ముద్దు బిడ్డ వంటి డైలాగ్‌ల‌తో సొహైల్ మ‌రింత క్రేజ్ సంపాదించుకున్నారు.

బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్లక‌ ముందు బుల్లి తెర సీరియ‌ల్స్‌లో, అడ‌పా ద‌డ‌పా మూవీస్ లో న‌టించిన ఈ న‌టుడు ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. కాగా ఈ న‌టుడికి తాజాగా అమెరికా నుంచి స‌ర్‌ప్రైజ్ బహుమతి వ‌చ్చింది. సొహైల్ అభిమానులైన హ‌రిణి, స్వాతి అనే ఇద్ద‌రు సొహైల్‌కి గిఫ్ట్‌ని పంపారు. ఆ గిఫ్ట్‌లో యాపిల్ కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్, ఇయ‌ర్ ప్యాడ్‌ల‌ను పంపారు. దీంతో సొహైల్ ఆనందంతో ఉబ్బి త‌బ్బుబ్బి అయిపోయాడు. వెంటనే వారికి వీడియో కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాడు సొహైల్.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కి అమెరికా నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts