
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)`. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
అయితే తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్ఆర్ఆర్ నుంచి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓ కీలక అప్డేట్ వస్తుందని ఆ సినిమా బృందం ప్రకటించింది. ప్రేక్షకులు ఏ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారో దాన్ని చెబుతామని ఇద్దరు హీరోలతో సహా ఆర్ఆర్ఆర్ సినిమా బృందంలోని దాదాపు అందరూ ట్వీట్లు చేశారు.
దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫుల్ ఎగ్జైట్‌గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియోమోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.