అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరంటే…!?

January 17, 2021 at 1:55 pm

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న బిల్ గేట్స్ అమెరికా లోనే అతిపెద్ద రైతుగా నిలిచారు. అమెరికాలోని 18 రాష్ట్రాల్లో మొత్తం 2 లక్షల 42 వేల ఎకరాల సాగు భూమి బిల్‌ గేట్స్‌ పేరిట ఉన్నట్లు నివేదికలు ద్వారా వెలువడ్డాయి. బిల్‌ గేట్స్‌ సాగు భూమిలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఇతర భూమిని కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. హార్స్ హెవెన్ హిల్స్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 14,500 ఎకరాలు వీటిలో ముక్యంగా చెప్పుకోవచ్చు. దీని కోసం ఆయన ఏకంగా రూ.1,251 కోట్లు మొత్తం చెల్లించారు. అంటే బిల్‌ గేట్స్‌ ఇప్పటివరకు మొత్తం 2,68,984 ఎకరాలను కొనుగోలు చేశారు.

బిల్ గేట్స్ ఇంత వ్యవసాయ భూమిని ఎందుకు కొన్నారో ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ, భూమిని నేరుగా, వ్యక్తిగత ఇన్వెస్ట్‌మెంట్ ఎంటిటీ క్యాస్కేడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. 2018 లో బిల్ గేట్స్ ఈ భూములను కొనుగోలు చేసినప్పుడు ఆ సంవత్సరంలో యూఎస్‌లో అత్యధికంగా కొనుగోలు చేసిన భూమిగా రికార్డులోకి ఎక్కింది. బిల్‌ గేట్స్, అతని భార్య మెలిండా నడుపుతున్న భారీ స్వచ్ఛంద సంస్థ బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు వ్యవసాయం కూడా ఒక ప్రధాన కేంద్రం. సబ్‌ సహారన్‌ ఆఫ్రికా, దక్షిణ ఆసియాలో వ్యవసాయ పరివర్తనకు మద్దతు ఇవ్వడం ఈ ఫౌండేషన్‌ ముఖ్య లక్ష్యం. బిల్ అండ్‌ మెలిండా గేట్స్ ఫౌండేషన్ 2008 లో ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్రికాతోపాటు ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లోని చిన్న రైతులకు రూ.2,238 కోట్ల సహాయాన్ని ఇస్తున్నామని, తద్వారా చిన్న రైతులు ఆకలి, పేదరికం నుంచి బయటపడగలరని సంస్థ పేర్కొన్నది.

అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts