
ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ కు బాంబే హై కోర్టు నుండి పెద్ద షాక్ తగిలింది. బృహన్ ముంబై కార్పొరేషన్ BMC నోటీసులను సవాల్ చేస్తూ ఆయన పెట్టిన పిటిషన్‌ను కొట్టి వేసింది. ఇంతకు ముందు సిటీ సివిల్ కోర్టు లోనూ సోను సూద్ కు ఇలాంటి అనుభవం ఎదురు అయింది. తాజాగా హైకోర్టులోనూ ఆయనకి ఊరట లభించలేదు.
సోనూ సూద్ పిటిషన్‌ను బాంబేే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి పృథ్వీరాజ్ చవాన్ తాజాగా కొట్టి వేశారు. జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని ఎటువంటి అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చివేశారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబరులో నోటీసులు జారీ చేసి ఇచ్చింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు సోనూ సూద్. కానీ ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇలా సోనూ సూద్‌కు ఊహించని షాక్ ఇచ్చింది బాంబే హైకోర్టు.
Bombay High Court dismisses actor Sonu Sood's petition challenging BMC notice on illegal construction at his residence https://t.co/NchYcpQmLW
— ANI (@ANI) January 21, 2021