రాజ‌మౌళిపై బోనీ కపూర్ మండిపాటు.. కార‌ణం ఏంటంటే?

January 27, 2021 at 11:13 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిపై బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్, శ్రీ‌దేవి భ‌ర్త బోనీ క‌పూర్ మండిప‌డ్డారు. జ‌క్క‌న్నపై బోనీ క‌పూర్ ఫైర్ అవ్వ‌డానికి కార‌ణం ఏంట‌బ్బా.. అన్న సందేహం వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం రాజ‌మౌళి.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్` సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు.

దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని.. దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానున్న‌ట్టు తాజాగా యూనిట్ ప్ర‌క‌టించింది. దీంతో ద‌స‌రా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ప్రేక్ష‌కులు ఎగ్జైట్‌గా ఉన్నారు. అయితే మ‌రోవైపు ఈ సినిమా విడుద‌ల తేదీ అక్టోబర్ 13నకు జ‌క్క‌న్న లాక్ చేయ‌డంలో బోనీ క‌పూర్‌కు షాక్ త‌గిలింది.

ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. బోనీ కపూర్ నిర్మాతగా అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న `మైదాన్` అక్టోబర్ 15న విడుదలను కన్ఫర్మ్ చేసుకుంది. మ‌రి `ఆర్ఆర్ఆర్` అక్టోబర్ 13న దేశ‌వ్యాప్తంగా విడుదల అయితే క్లాషెస్ వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే బోనీ క‌పూర్ మాట్లాడుతూ.. `మేము ఆరు నెలలు ముందుగానే మా రిలీజ్ డేట్ ను ప్రకటించాం. పోటీ వాతావరణం లేకుండా ఉండడానికి చాలా ముందుగానే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తున్నాం. కానీ రాజమౌళి నిర్ణయం పూర్తిగా అనైతికం` అంటూ వ్యాఖ్యానించారు.

రాజ‌మౌళిపై బోనీ కపూర్ మండిపాటు.. కార‌ణం ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts