షాకింగ్ : ఐస్ క్రీమ్ ద్వారా కరోనా వైరస్…!?

January 16, 2021 at 2:37 pm

ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనా కూడా ఇంకా వైరస్‌ మాత్రం ప్రజలను భయ బ్రాంతులను చేస్తుంది. ఇప్పుడు తాజాగా కొత్త తరహాలో ఎటాక్‌ చేస్తూ ఉంది. తాజాగా చైనాలో వెలుగు చూసిన ఓ సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఐస్ క్రీమ్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజల్లో కల్లోరం మొదలైంది. అసలు వివరాల్లోకి వెళ్తే చైనాలోని టియాంజిన్ మున్సిపాలిటీలో టియాంజిన్ డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో వైరస్ ఉందని వారు గుర్తించారు అక్కడ స్థానిక అధికారులు. వాటిలో 2,089 డబ్బాలను స్టోరేజ్‌లో ప్యాక్ చేయగా వైరస్ కలిగిన 1,812 డబ్బాలను మరో ప్రాంతానికి తరలించారు. ఇంకో 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌లోకి ప్రవేశించాయి. వాటిలో 65 డబ్బాలను ఇప్పటికే ప్రజలు విక్రయించినట్టు గుర్తించారు. దానితో ఇప్పుడు అవి కొనుగోలు చేసింది ఎవరు అనేది ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు.

ఐస్‌ క్రీమ్ డబ్బాల్లో కోవిడ్‌ వైరస్ ఘటనపై మీడియాతో మాట్లాడిన యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైరాలజిస్ట్ డాక్టర్ స్టీఫన్ గ్రాఫిన్, ఆ డబ్బాల్లో కరోనా వైరస్ మనుషుల ద్వారానే ప్రవేశించింది అని అన్నారు. అక్కడ ఐస్‌క్రీమ్ ప్రొడక్షన్ ప్లాంట్ అంతా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని వారు హెచ్చరించారు. ఇది ఫ్యాట్‌తో తయారు చేడయం వల్ల కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచడం వల్ల వైరస్ చాలా వేగంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. అంటే కరోనా సోకిన వ్యక్తి ఐస్‌క్రీమ్‌ తయారీలో పాల్గొనడం వల్లనే ఐస్‌క్రీమ్‌లోకి వైరస్ చొరబడి చేరినట్టుగా వారు చెబుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడిప్పుడే ప్రజలు భయం లేకుండా తిరిగేస్తున్నారు. కానీ, ఇలాంటి ఘటనతో మళ్లీ జనాల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

షాకింగ్ : ఐస్ క్రీమ్ ద్వారా కరోనా వైరస్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts