
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ అందరికి అలవాటు అయిపోయింది. అందరు చాలా మటుకు ఇంటి నుండే తమ తమ పనులను చేసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా కథలు రాసుకోవడం, వారిలో ఉన్న స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో తమకు ఇష్టమయిన పనులను చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే బాలీవుడ్ అందాల భామ జాన్వీకపూర్ మాత్రం వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్ బోరుగా ఫీలవుతుందట.
ఇటీవలే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ స్టిల్ నే ఉదాహరణగా చెప్పొచ్చు. వైట్ ఫుల్ కోటును వేసుకున్న జాన్వీ లాప్ టాప్ ముందు కూర్చొని చేతిలో స్ట్రా గ్లాస్ ను పట్టుకుని డల్‌గా కనిపిస్తుండటం ఆ పిక్ లో చూడచ్చు. వర్క్‌ఫ్రమ్ హోం చాలా ఫన్నీగా ఉంటుందని వాళ్లు చెప్పారు కానీ తనకు అసలు ఆసక్తిలేనట్టుగా కనిపిస్తున్న ఈ పిక్ కి క్యాప్షన్ కూడా ఇచ్చింది. జాన్వీకపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్నీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పంజాబ్ లో మొదలైంది. దీనికి సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.