వైరల్ : మీరు ఎప్పుడైనా బట్టర్ టీ ట్రై చేసారా…!?

January 18, 2021 at 4:21 pm

పొద్దున్నే లేవగానే ఒక కప్పు చాయ్‌ లేదా కాఫీ కడుపులో పడితేగాని ఆ రోజు గడవదు. లేవగానే హాట్ హాట్ చాయ్‌ తాగిన తర్వాతనే ఏ పని అయిన మొదలు పెడతారు కొందరు. అయితే ఉదయాన్నే తీసుకునే ఈ టీని ప్రజలంతా ఒక్కో రకంగా తయారు చేసుకుంటారు. అల్లం టీ, లెమన్‌ టీ, మసాలా టీ, ఇలా కొన్ని రకాలు ఉంటాయి. కానీ ఎప్పుడైన బటర్‌ చాయ్‌ తాగారా. ఆ రకం చాయ్‌ ఉంటుందని కనీసం విన్నారా. అయితే ఆగ్రాలోని ఓ టీ నిర్వహకుడు మరుగుతున్న టీలో బటర్‌ కట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోకు ఇప్పటికి వరకు 2.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

వేడి వేడి బటర్‌ టీ అందిస్తున్న టీ స్టాల్‌ నిర్వహకుడిపై నెటిజన్‌లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆగ్రాలో బాబా స్టాల్‌ షాపు నిర్వహకుడు వెరైటీగా ఆలోచించి మరుగుతున్న టీలో బటర్‌ ముక్కలు కట్‌ చేసి వేశాడు. బటర్‌‌ కరిగాక ఆ చాయ్‌ని వడ పోసి పెట్టాడు. ఈ వీడియోను ఫుడ్డీస్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేయడంతో బాగా వైరల్ అయింది. అది చూసిన నెటిజన్స్ అంతా చాయ్‌లో వెన్న వేయడం ఏంటయ్యా అంటూ తల పట్టుకుంటూ కొందరూ బటర్‌ చాయ్‌ నిర్వహకుడిపై వ్యంగ్యాస్త్రాలు వదులు తున్నారు. టీలో బటర్‌తో పాటు సాస్‌, మయోన్నైస్ కూడా కాస్తా వేయ్‌, కొంచం పావ్‌ బాజీ కూడా వేయండి అంటూ స్టాల్ ఓనర్ పై వెటకారంగా ఘాటు ఘాటుగా కామెంట్స్ రూపంలో ఇంకొంత మంది మండి పడుతున్నారు. ఏది ఏమైనా బట్టర్ చాయ్ అంటూ డిఫరెంట్గా ఆలోచించి భలే చేసారు అంటూ హర్షిస్తున్నారు ఇంకొంతమంది.

వైరల్ : మీరు ఎప్పుడైనా బట్టర్ టీ ట్రై చేసారా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts