అభిమాని చేసిన పనితో ఛార్మి షాక్‌.. పిచ్చి మరో లెవల్ అంటూ కామెంట్‌!

January 19, 2021 at 10:04 am

సాధార‌ణంగా ఏ హీరోకైనా అభిమానులు.. వీరాభిమానులు ఇలా రెండు రాకాలుగా ఉంటాయి. అయితే వీరిలో వీరాభిమానుల విష‌యానికి వ‌స్తే.. త‌మ అభిమాన హీరోకు సంబంధించి ఏ అప్‌డేట్ వ‌చ్చినా కాస్త ఓవ‌ర్‌గానే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ అభిమాని కూడా అలాగే చేశారు.

విజయ్ దేవరకొండ ప్ర‌స్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ పోస్ట‌ర్ నిన్న చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `లైగర్` అనే టైటిల్‌ను ఖారురు చేశారు. సాలా క్రాస్‌ బ్రీడ్‌… అనేది ట్యాగ్ లైన్‌. ఇక నిన్న టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డంలో.. విజ‌య్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు.

ఆ ఆనంద‌లోనే ఓ అభిమాని ఏకంగా తన చేతి మణికట్టుపై ‘లైగర్’ అనే పేరును పచ్చబొట్టుగా కొట్టించుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో.. లైగ‌ర్ నిర్మాత‌ల్లో ఒక‌రైన ఛార్మి షాక్ అవ్వ‌డంతో పాటు ఆస‌క్తిక‌ర కామెంట్స్ కూడా చేసింది. `పిచ్చి మరో లెవల్‌కి వెళ్లింది. పర్మనెంట్ టాటూ వేయించుకున్నాడు. లైగర్ సినిమాపై మీరు పెట్టుకున్న నమ్మకానికి గర్విస్తున్నా. మీపై నేను చూపించే ప్రేమ కొలవలేనిది` అని పేర్కొంది.

అభిమాని చేసిన పనితో ఛార్మి షాక్‌.. పిచ్చి మరో లెవల్ అంటూ కామెంట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts