ఛీటింగ్ కేసులో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ యంగ్ హీరో!

January 20, 2021 at 10:11 am

టాలీవుడ్‌కు చెంద‌న ఓ యంగ్ హీరో ఛీటింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు. అతి తక్కువ ధరకే కార్లను ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసినట్టు ప‌లువురు ఆ హీరోపై కేసు న‌మోదు చేశారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు.. విశ్వంత్‌. ఈయ‌న‌ పూర్తి పేరు విశ్వనాథ్. కాకినాడలోని సామర్లకోటలో పుట్టిన విశ్వంత్.. పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నారు.

ఇంటర్ హైదరాబాద్‌లో చదివిన విశ్వంత్.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూరులో పూర్తి చేశారు. ఇక కేరింత సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన విశ్వంత్‌.. మనమంత, జెర్సీ, ఇటీవ‌ల వ‌చ్చిన ఓ పిట్ట క‌థ వంటి చిత్రాల్లో న‌టించారు. అయితే తాజాగా విశ్వంత్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

తక్కువ రేటుకు కార్లు ఇప్పిస్తానంటూ విశ్వంత్ మోసానికి పాల్పడ్డాడు అనేది అభియోగం. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వంత్‌ను విచారించేందుకు రెడీ అయ్యారు. ఇక పోలీసుల విచారణలో విశ్వంత్ మోసానికి పాల్పడినది లేనిది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఛీటింగ్ కేసులో అడ్డంగా బుక్కైన టాలీవుడ్ యంగ్ హీరో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts