23 సంవత్సరాల వయసులోనే 11 పెళ్ళిలు…!?

January 16, 2021 at 3:09 pm

చూస్తే అమాయకుడిలా చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న ఈ యువకుడు ప్రేమ పేరుతో అమ్మాయిలకు వలవేసి, ఒకరికి తెలియకుండా మరోకరిని 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అదేంటని పోలీసులు అడిగితే ఇది నాకు మాములే అంటూ చెప్పాడు. నిందితుడ్ని అరెస్ట్ చేసి తమిళనాడులోని విల్లివాక్కంలో పోలీసులు విచారణ చేపట్టారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని విల్లివాక్కంకు చెందిన లవ్లీ గణేష్ అనే వ్యక్తి కొలాత్తూర్ కు చెందిన 20 ఏళ్ల యువతితో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబర్ 5న ఇంట్లో పెద్దలకు చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకున్నారు. తమ కూతురు కనపడక పోయే సరికి అమ్మాయి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై కిడ్నాప్ కేసు ఉందని తెలుసుకున్న గణేష్ విల్లివాక్కం పోలీసుల వద్దకు వెళ్లి అత్తమామల నుంచి రక్షణ కల్పించమని కోరాడు. పోలీసులు అమ్మాయి తల్లితండ్రులను పిలిపించారు కానీ ఆ యువతి తమ తల్లితండ్రులతో వెళ్ళటానికి ఇష్ట పడలేదు. తాను గణేష ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని, అతినితో సంతోషంగా కాపురం చేసుకుంటున్నాను అని వారికి చెప్పింది.

అనంతరం వాళ్లిద్దరూ విల్లివాక్కంలోని రాజాజీ నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఆ తరువాత అయనవరం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికను ఇంట్లో పని చేయటానికి గణేష్ తీసుకు వచ్చాడు. దీనికి అతని భార్య వ్యతిరేకించింది. పనిమనిషిని పంపించేయమని కోరింది కానీ గణేష్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయం పై దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో గణేష్ తన భార్యను గదిలో బంధించి తాళ్లతో కట్టేసి హింసించటం మొదలు పెట్టాడు. ఇంటికి తీసుకువచ్చిన 17 ఏళ్ల బాలికతో భార్య ముందే సన్నిహితంగా మెలగటం ప్రారంభించాడు. దీనితో ఇంటి యజమానికి జరిగిన విషయం చెప్పి ఆయన సహాయంతో తన పుట్టింటికి చేరింది. గణేష్ ప్రవర్తనను తల్లితండ్రులకు తెలిపింది. వారు వెంటనే విల్లివాక్కం మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేష్ ను అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో గణేష్ కొన్ని షాకింగ్ నిజాలు చెప్పాడు. తనకు ఇలాంటివి మామూలేనని ఇప్పటిదాకా ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకున్నానని, ఇది నాకు కొత్తేమి కాదని చెప్పేసరికి పోలీసుల ఆశ్చర్య పోయారు. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు. 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన సంగతి రుజువవటంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

23 సంవత్సరాల వయసులోనే 11 పెళ్ళిలు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts