అందమైన పక్షులకి కేర్ అఫ్ అడ్రస్ చిలికా సరస్సు …!

January 3, 2021 at 1:58 pm

అందమైన చూడదగ్గ ప్రదేశాలలో చిలికా సరస్సు కూడా ఒకటి. భారత దేశపు తూర్పు తీరం లో ఉన్న ఉప్పు నీటి సరస్సు. ఇది దయా నది ముఖ ద్వారం వద్ద ఒడిషా రాష్ట్రం లోని పూరీ, గంజాం జిల్లాలో ఉంది. అక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఈ సరస్సు బాగా ఆకట్టుకుంటుంది. ఈ సరస్సు అంతా కూడా వలస పక్షుల తో ఎంతో అందంగా ఉంటుంది. ఈ సరస్సు విస్తీర్ణం 1100 చదరపు కిలో మీటర్లు పైచిలుకు ఉంటుంది.

ఇక్కడున్న పక్షుల్లో 45 శాతం నేల పై ఉండేవి, 32 శాతం నీటి పక్షులు ఉన్నాయి. 23 శాతం ఒడ్డున నీటి లో నడుస్తూ ఉండే తీర పక్షులు. 14 రకాల వేటాడే పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. దాదాపు 152 ఐన ఇరావడీ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. ఇదే కాకుండా 37 రకాల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి అని అధ్యయనంలో వెల్లడించారు.

అందమైన పక్షులకి కేర్ అఫ్ అడ్రస్ చిలికా సరస్సు …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts