మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `ఆచార్య‌` టీజ‌ర్‌కు డేట్ లాక్?

January 20, 2021 at 11:42 am

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి హీరో రామ్‌ చ‌ర‌ణ్ కొణిదెల బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ఇక మణిశర్మ చాలా ఏళ్ళ తర్వాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా జ‌రుగుతున్న‌ ఈ సినిమా షూటింగ్‌లో చ‌ర‌ణ్ కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆచార్య నుంచి సూప‌ర్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఆ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల‌కు చిత్ర యూనిట్ డేట్ లాక్ చేసింద‌ట‌.

ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ‘ఆచార్య’ మూవీ టీజర్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని స‌మాచారం. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. `ఆచార్య‌` టీజ‌ర్‌కు డేట్ లాక్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts