సుప్రీం ఊహించ‌ని తీర్పు.. ఎస్ఈకీ సహకరించాలంటూ జ‌గ‌న్ ఆదేశాలు!

January 26, 2021 at 8:18 am

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వాయిదా కోరుతూ ఏపీ స‌ర్కార్‌, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌ను నిన్న విచారించిన సుప్రీం కోర్టు.. ఊహించ‌ని తీర్పును ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని, ఏపీలో స్థానిక ఎన్నికలు యథావిధిగా జరపాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చి రాష్ట్ర ప్ర‌భుత్వానికి షాక్ ఇచ్చింది.

ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో..ముఖ్యమంత్రి జగన్ అత్యవసర సమీక్షను నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ ముఖ్య నేతలు, ఉన్నతాధికారులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పుపై చర్చించినంత‌రం.. ఈ ఎన్నికల్లో ఎస్ఈకీ సహకరించాలని నేతలను, అధికారులను జ‌గ‌న్‌ ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని సీఎం జగన్ తెలిపారు. మ‌రోవైపు ఎన్నిక‌ల‌కు లైన్ క్లియ‌ర్ అవ్వ‌డంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు పెంచింది. తీర్పు వెలువడిన వెంటనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేశారు. రీషెడ్యూల్ చేసిన మేరకు…. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా మార్చారు. మూడో దశ ఎన్నికలను రెండో దశగా , నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుదో దశగా మార్చారు.

సుప్రీం ఊహించ‌ని తీర్పు.. ఎస్ఈకీ సహకరించాలంటూ జ‌గ‌న్ ఆదేశాలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts