రేషన్ మొబైల్ వాహనాలను ప్రారంభించిన సీఎం…!

January 21, 2021 at 1:06 pm

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం నాడు పౌర సరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను మొదలు పెట్టిన సీఎం జగన్ ఈ ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి మొదలు పెట్టారు.

మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను ఆయా ప్రాంత మంత్రులు మొదలు పెట్టనున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభం కాగా, ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ కోసం ఈ వాహనాలు రెడీ అయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగు పరచిన మంచి బియ్యాన్ని ఇంటి వద్దనే అందించేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఈ పథకాన్ని రూపొందించారు.

రేషన్ మొబైల్ వాహనాలను ప్రారంభించిన సీఎం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts