గ‌ర్భిణీల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త‌.. మ‌రో కొత్త పథకం ప్రారంభం!

January 28, 2021 at 2:24 pm

ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. పేదల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న జ‌గ‌న్‌.. తాజాగా గ‌ర్భ‌ణీల కోసం మ‌రో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు.

గర్భిణులు పరీక్షల కోసం ఆస్పత్రులకు వెళ్లే సమయంలో ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని జ‌గ‌న్ స‌ర్కార్‌ నిర్ణయించింది. తొలిదశలో 5 జిల్లాల్లో ఈ ఉచిత రవాణా ప్రాజెక్టును మొదలు పెట్టనుంది. ఇందుకోసం మొదట 170 వాహనాలు అందించేందుకు ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఐదు జిల్లాల వాహనాలకు కలిపి ప‌ది కోట్ల వ్యయం అవుతుందని ఓ అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ ప‌థ‌కం ద్వారా ఏటా సుమారు 3 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరుతుందని ప్ర‌భుత్వం భావిస్తోంది. కాగా, ఇప్ప‌టికే గ‌ర్భ‌ణీల‌కు వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ప‌థ‌కం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్ ప్రోత్సాహకాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌ర్భిణీల‌కు సీఎం జ‌గ‌న్ శుభ‌వార్త‌.. మ‌రో కొత్త పథకం ప్రారంభం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts