వైర‌ల్‌గా మారిన ‌మెడీయ‌న్స్ గ్రూప్ పిక్..!!

January 18, 2021 at 2:56 pm

ఒక‌ప్పుడు నవ్వులు పండించ‌డం కొంత మందికి మాత్ర‌మే సాధ్య‌మ‌య్యేది. అప్పట్లో అల్లు రామ‌లింగ‌య్య, బ్ర‌హ్మానందం త‌రాల‌లో వీరంత గొప్పగా మరెవ్వరు అంతలా హాస్యాన్ని పండించ‌లేక‌పోయారు. కానీ ఇప్పుడు అలా కాదు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది క‌మెడీయ‌న్స్ ప్రేక్షకులను పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు వచ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటూ ఇటు హావ‌భావాల‌తో అటు డైలాగ్స్‌తోను పాటు వినోదం అందిస్తూ వచ్చారు.

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మంచి సంప్ర‌దాయం నెలకొంది. ప్రతి ఏడాది ఏదో ఒక స‌మ‌యంలో హీరో హీరోయిన్స్, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, క‌మెడీయ‌న్స్ అందరు కలిసి గ్రూపులుగా ఒకే చోట పార్టీ చేసుకుంటున్నారు. ఫ్లయింగ్ కలర్స్ పేరుతో కొద్ది సంవ‌త్స‌రాలుగా క‌మెడీయ‌న్స్ అందరు క‌లుస్తూ వ‌స్తుండ‌గా, తాజాగా 11 మంది క‌మెడీయ‌న్స్ ఒకే చోట చేరి సంద‌డి చేశారు. వీరంద‌రు కలిసి దిగిన ఫొటోని వెన్నెల కిషోర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ప్ర‌స్తుతం ఈ ఫోటో బాగా వైర‌ల్ అవుతుంది.

వైర‌ల్‌గా మారిన ‌మెడీయ‌న్స్ గ్రూప్ పిక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts