
కంటికి కనిపించని అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పడు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో నిన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు వందలకు పైగా నమోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 202 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 2,91,118 కి చేరింది. ఇక నిన్న ఇద్దరు కరోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,574 కు పెరిగిందని వెల్లడించింది.
అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 253 నమోదు కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,85,102 కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 4,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే 19,898 కరోనా టెస్ట్లు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 73,99,436 కు చేరుకుంది.