తెలంగాణ‌లో కొత్త‌గా 226 క‌రోనా కేసులు.. రిక‌వ‌రీ కేసులెన్నంటే?

January 21, 2021 at 10:26 am

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌డు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య గ‌త కొద్ది రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 226 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,92,621 కి చేరింది. ఇక నిన్న ఒక్క‌రు క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,584 కు పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 224 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,87,117 కి చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో 3,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 2,322 హోంఐసోలేష‌న్‌లో ఉన్నారు. కాగా, నిన్న ఒక్క రోజే 31,647 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రోనా టెస్టుల సంఖ్య 75,74,184 కు చేరుకుంది.

తెలంగాణ‌లో కొత్త‌గా 226 క‌రోనా కేసులు.. రిక‌వ‌రీ కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts