కరోనా వైరస్ ‌ను పసిగట్టే గ్యాడ్జెట్స్‌ మీ కోసం..!

January 18, 2021 at 3:18 pm

స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు అనారోగ్యాలను ముందస్తుగా గుర్తించగలవని ఇంతకు ముందు చేసిన అధ్యయనాల్లో తేలింది. తాజాగా ఇవి కోవిడ్-19 కేసులను కూడా గుర్తించగలవని తాజా పరిశోధన ద్వారా వెలువడింది. ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వచ్చే అవకాశాన్ని ఇవి కొన్ని రోజుల ముందుగానే గుర్తించగలవని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ హెల్త్ సిస్టమ్, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్థలు ఈ పరిశోధనలు చేశాయి. ఫిట్‌బిట్, గార్మిన్, యాపిల్ వంటి కంపెనీలు అభివృద్ధి చేసిన స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లు గుండె కొట్టుకునే వేగంలో తేడాలను గుర్తించి వీటి ద్వారా శరీరంలో అనారోగ్యాలు వెలుగు చూసే అవకాశాన్ని మనం ముందుగానే గుర్తించి, జాగ్రత్తలు తీసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.

మౌంట్ సినాయ్ అధ్యయన బృంద సభ్యుడు రాబర్ట్ హిర్టెన్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్ల సాయంతో అంటు వ్యాధుల ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చని ఆయన చెప్పారు. వైరస్‌ను గుర్తించవచ్చు. కోవిడ్-19తో పాటు ఇతర అనారోగ్యాలను స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్ల ద్వారా ముందుగానే గుర్తించవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ మైఖేల్ స్నైడర్ తెలిపారు. ఈ రోజుల్లో కోవిడ్-19 పరీక్షల ఫలితాలు రావడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల వైరస్‌ను గుర్తించడంలో కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది. ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌వాచ్‌ల ద్వారా ఇలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు అని స్నైడర్ తెలిపారు. ఈ అధ్యయనానికి యాపిల్, గార్మిన్, ఫిట్‌బిట్, ఇతర సంస్థలు స్పాన్సర్‌గా వ్యవహరించలేదని పరిశోధకులు తెలిపారు. ధరించగలిగే ట్రాకర్లలో గుర్తించే హార్ట్ బీట్ రేటులో తేడాలను అనారోగ్యాలను సంకేతంలా భావించి, గుండె కొట్టుకునే వేగంలో హెచ్చు తగ్గులను గుర్తించినప్పుడు డాక్టర్లను సంప్రదించాలి. దీంతో అనారోగ్యాలను ముందుగానే గుర్తించడం వారికి సులభం అవుతుంది.

కరోనా వైరస్ ‌ను పసిగట్టే గ్యాడ్జెట్స్‌ మీ కోసం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts