ఆ బ్ల‌డ్ గ్రూప్ వారిలో క‌రోనా వ్యాప్తి అధికం.. మీదే గ్రూపో..?!

January 26, 2021 at 11:14 am

ప్ర‌పంచ‌దేశాల‌ను క‌ల‌వ‌ర పెడుతోన్న క‌రోనా వైర‌స్‌.. ఇప్ప‌టికే కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ మ‌హ‌మ్మారి.. వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై ప్ర‌భావం చూపుతోంది. ఇక‌ భార‌త్‌లో కూడా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటీ దాటేసింది. అయితే ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. క‌రోనా గురించి ప‌లు ఆస‌క్తికర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దేశంలోని 17 నగరాల్లో చేసిన రీసెర్చ్‌లో ప‌లు కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఇందులో భాగంగా.. బ్లడ్ గ్రూప్‌ల వారీగా చేసిన అధ్యయనం ప్ర‌కారం ‘ఏ’ బ్లడ్ గ్రూప్ వారిలో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉందట‌.

అలాగే ‘o’ గ్రూప్ వారిలో వైరస్ వ్యాప్తి తక్కువగా.. ‘బీ’, ‘ఏబీ’ గ్రూప్‌లలో మధ్యస్థంగా వైరస్ వ్యాప్తి ఉంటుందని నిపుణులు గుర్తించారు. మ‌రి మీది కూడా `ఏ` బ్ల‌డ్ అయితే గ‌నుక మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండండి. అలా అని మిగిలిన వారు అజాగ్ర‌త్త‌గా ఉంటే.. డేంజ‌ర్‌లో ప‌డ‌తారు. వారు కూడా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఇక మ‌రో విష‌యం ఏంటంటే.. శాకాహారుల్లో 6.8 శాతం.. మాంసాహారుల్లో 11 శాతం వరకూ క‌రోనా వైరస్ వ్యాప్తి ఉంటుంద‌ని మ‌రో అధ్య‌య‌నంలో తేలింది.

ఆ బ్ల‌డ్ గ్రూప్ వారిలో క‌రోనా వ్యాప్తి అధికం.. మీదే గ్రూపో..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts