వైరల్ వీడియో : డాన్సింగ్ కార్ ని ఎప్పుడైనా చూసారా మీరు..!?

January 1, 2021 at 6:14 pm

మాములుగా మనం కారులో వెళ్తున్నప్పుడు సడెన్ గా కారు ఆగాలంటే ఏమి చేస్తాము.కారుకు ఉన్న బ్రేకులు వేస్తే చాలు వెంటనే కారు అమాంతం ఆగిపోతుంది కదా.. అయితే ఇది అందరికి తెలిసిన విషయమే.. కానీ ఇప్పుడు చెప్పబోయే కారు గురించి వింటే షాక్ అవుతారు. అది ఏంటంటే ఒక వ్యక్తి తయారుచేసిన కారు బ్రేకులు వేసినప్పుడల్లా డాన్స్ చేయడం అన్నమాట.. కారు డాన్స్ చేయడమేంటని డౌటొచ్చింది కదూ. అవును నిజమే, కారు డాన్స్ చేస్తోంది.డాన్స్ చేయడంతో పాటు కిర్రాకైన పాటలు, లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. అప్పుడు ఆ కారును చూస్తే చిన్న సైజు రికార్డింగ్ డాన్సులా అనిపిస్తుంది. అసలు వివరాలలోకి వెళితే ఢిల్లీకి చెందిన నాజమ్ అహ్మద్ అనే వ్యక్తికి ఓ కారు ఉంది.

అతను ఎదో ఒక కొత్త ప్రయోగం చేసి అందరిని ఆశ్చర్యపరచాలని అనుకున్నాడు. అందుకనే తన దగ్గర ఉన్న మహీంద్రా స్కార్పియో కారులో ఉండే షాకర్స్ ను తీసేసి పెద్దవి పెట్టాడు. ఇంకేముంది బ్రేకులు వేసినప్పుడల్లా కారు జంప్ చేస్తూ డాన్స్ చేస్తున్నట్టుగా కనిపించేలా సెట్ చేశాడు. అలాగే ఆ కారుకు రంగురంగుల లైట్ సెట్టింగులను తగిలించి, పెద్ద పెద్ద స్పీకర్లను కూడా అమర్చాడు.

అంతే గత ఆదివారం అదిరిపోయే మాస్ సాంగ్స్ పెట్టి, పెద్ద పెద్ద సౌండ్లతో అందరినీ అదిరిపోయేలా చేశాడు. ‘కారు డాన్స్ చేయడం చూసి చాలా మంది ఆసక్తిగా చూశారు. కానీ మరి కొందరికి న్యూసెన్స్ గా అనిపించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు అక్కడికి వచ్చి, అతడి కారును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కారు యజమానికి రూ. 41,500 జరిమానా విధించారు. ఏది ఏమయినా గాని ఆ డాన్సింగ్ కారుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. !!

వైరల్ వీడియో : డాన్సింగ్ కార్ ని ఎప్పుడైనా చూసారా మీరు..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts