
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ లాక్డౌన్ ముందు వరకు మంచి క్రికెటర్‌గానే తెలుసు అందరికి కానీ లాక్డౌన్ తర్వాత వార్నర్‌లో చాలా కళలు ఉన్నాయని తెలిసింది. తెలుగు, తమిళం, హిందీ భాషలకు సంబంధించిన సాంగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి అలరించిన వార్నర్ ఇప్పుడు మార్ఫ్డ్ ఫేస్ యాప్ తో వెరైటీ వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్, మహేష్ బాబు, హాలీవుడ్ కమెడీయన్ మిస్టర్ బీన్ ముఖాలకు తన ముఖాన్ని పెట్టి వీడియో చేసి అందరితో వావ్ అనిపించుకున్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ ఫేస్ తన ఫేస్ పెట్టుకొని ఓ వీడియో చేశాడు. ఇది చేసి ఇలాంటి వీడియో చెయ్యటం చాలా కష్టమంటూ వీడియో కింద క్యాప్షన్‌గా రాసాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఒకసారి చూసి తరించేయండి.