
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ చిత్రం కూడా ఉంది. ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ను ఫిక్స్ చేశారు. మరో కీలకపాత్రలో బిగ్ బీ అమితాబ్ నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది.
అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. సినిమా కంటే ముందు ఆదిపురుష్ , సలార్ సినిమాలను ప్రభాస్ చేయబోతున్నాడట. ఈ రెండు చిత్రాల తర్వాత నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇంత ఆలస్యం కావడానికి దీపికానే కారణం అన్నట్టుగా టాక్ నడుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రభాస్‌కు, చిత్ర యూనిట్‌కు దీపికా షాక్ ఇచ్చిందట.
ప్రభాస్ మూవీకి ఓకే చెప్పిన దీపికా.. ఇటీవల హృతిక్ ఫైటర్ చిత్రానికి కూడా ఒప్పుకుంది. ఈ ఏడాది వేసవి కాలం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి దీపికా డేట్లను ఇచ్చేసిందట. అయితే ఈ పాత్రకు దీపికా తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా నమ్ముతున్న నాగ్ అశ్విన్.. ఆమె కోసం వెయిట్ చేస్తానని చెప్పారట. ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్-ప్రభాస్ చిత్రం ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్‌ను పక్కన బెట్టడంతో.. దీపికాపై ఆయన ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నట్టు టాక్.