
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జయలలిత జీవిత నేపథ్యంలో తలైవీ అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయగా, ప్రస్తుతం ధాకడ్ అనే మూవీ చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌గా సాగే యాక్షన్ సినిమా అని చెప్పిన కంగనా, భారతీయ సినిమాలలో ఉత్తమ సినిమాగా ఈ మూవీ నిలుస్తుందని కంగనా రనౌత్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాల కోసం కంగనా రనౌత్ స్టంట్ మాస్టర్ బ్రెట్ చాన్ దగ్గర ప్రత్యేక శిక్షణను కూడా తీసుకుంది.
రజనీష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధాకడ్ చిత్రంలో మిమోహ్ చక్రవర్తి, మనోజ్ తివారి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కథా రచయిత రితేష్‌షా, నిర్మాత సొహెయిల్ మక్లాయ్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. అక్టోబర్ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తునట్లు కంగనా తన ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఈ చిత్రం పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.