నటితో టాప్ డైరెక్టర్‌ ప్రేమ వివాహం..!!

January 26, 2021 at 3:46 pm

తమిళ దర్శకుడు దేసింగ్‌ పెరియసామి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నటి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నిరంజని అగత్యాన్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ విషయాన్ని నిరంజని అక్క భర్త, ఫిల్మ్‌మేకర్‌ తిరు ధృవీకరించాడు. ఈ క్రమంలో ఒక పెళ్లి పత్రికను కూడా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. పాండిచ్చేరిలో ఫిబ్రవరి 25న పెళ్లి జరగనున్నట్లు డైరెక్టర్‌ దేసింగ్‌ పేర్కొన్నారు.

దేసింగ్‌ పెరియసామి ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయాదిత్తల్ సినిమా ద్వారా దర్శకుడిగా తెరంగ్రేటం చేశాడు. ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్‌ రాలేదని, సినిమా అద్భుతంగా ఉందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు. ఇక ఇదే చిత్రంలో ప్రముఖ దర్శకుడు అహాతియాన్‌ కూతురు నిరంజని అగత్యాన్‌ కూడా నటించగా సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆమెతో దర్శకుడు ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు కలవడంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. దీంతో వచ్చే నెలలోనే వీళ్లిద్దరి పెళ్లి ఉండనుంది.

నటితో టాప్ డైరెక్టర్‌ ప్రేమ వివాహం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts