రామ్‌చరణ్‌, యశ్‌తో మల్టీస్టారర్..‌!

January 22, 2021 at 3:01 pm

మాములుగా శంకర్‌ సినిమాలు అంటేనే భారీగా ఉంటాయి. భారీ గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్‌ శంకర్ మూవీ యొక్క స్పెషాలిటీ. ప్రస్తుతం ఇండియన్‌ మూవీ సీక్వెల్‌ ఇండియన్‌ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఆయన. ఈ చిత్రం తరువాత శంకర్‌ ఓ భారీ మల్టీ స్టారర్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సినీ వర్గాల సమాచారం. తెలుగు సూపర్‌ స్టార్‌ రామ్‌చరణ్, కన్నడ స్టార్‌ హీరో యశ్‌ను హీరోలుగా పెట్టి దర్శకుడు శంకర్ ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ . ప్రస్తుతం కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఇదే లేటెస్ట్ చర్చ నడుస్తుంది.

చరణ్, యశ్‌ హీరోలుగా ఓ చారిత్రాత్మక యుద్ధ నేపథ్యం ఉన్న చిత్రం ప్లాన్న్నా చేస్తున్నారంట శంకర్‌. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ఇండియన్‌ 2’ పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని కోలీవుడ్‌ న్యూస్‌. 2022 రెండో భాగంలో మూవీ చిత్రీకరణ మొదలు కావచ్చని పలు వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్‌చరణ్‌, యశ్‌తో మల్టీస్టారర్..‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts