
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందనుంది.
ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ మారెడుపల్లి అడవులలో శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏటంటే.. ఈ చిత్రం తెరకెక్కించేందుకు సుకుమార్ భారీగానే రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట.
ఈ సినిమాకు గాను సుకుమార్ ఏకంగా 23 కోట్ల మేర రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి డైరెక్టరే ఇంత తీసుకుంటున్నాడంటే.. హీరో బన్నీ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ డీ గ్లామర్ లుక్‌లో కనిపించనున్నాడు. అంతేకాదు, ఇందులో చిత్తూరు స్లాంగ్‌లో మాట్లాడబోతున్నాడు.