వెబ్ సిరీస్‌‌ తాండ‌వ్ కు వ్య‌తిరేకంగా గాడిద‌ల‌తో నిర‌స‌న‌..!!

January 22, 2021 at 4:29 pm

ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన తాండవ్‌ వెబ్‌‌ సిరీస్‌పై నిర‌స‌న ఇంకా కొన‌సాగుతూనే ఉంది. తమ త‌ప్పు ఒప్పుకొని క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో పాటు హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ ‌తీసే స‌న్నివేశాలు తొల‌గించిన‌ప్ప‌టికి తాండ‌వ్‌కు నిర‌స‌నలు ఇంకా ఆగ‌డం లేదు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ ఎల్‌జేపీ పాట్నాలో గాడిద‌ల‌తో నిర‌స‌న చేప‌ట్టారు. తాండ‌వ్ చిత్ర ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్, ప్ర‌ధాన పాత్ర దారుడు అయిన సైఫ్ అలీఖాన్ ఫొటోల‌ను గాడిద మెడ‌లో వేసి దానిపై దేశ ద్రోహి, హిందూల విరోధి అంటూ గడీల మేడలో రాసి ఊరేగించారు. తాండ‌వ్ వెబ్ సిరీస్ కారణంగా స‌మాజంలో విభ‌జ‌న సృష్టిస్తుంద‌ని వారు తెలిపారు. తాండ‌వ్ వెబ్ సిరీస్ హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా, మ‌త విద్వేషాలు రెచ్చ ‌గొట్టేలా ఉన్నాయి.

ఇవి ఆమోదం అయేవి కావు అంటూ రాహుల్ అనే నిర‌స‌న‌ కారుడు స్ప‌ష్టం చేసాడు. ఈపాటికే తాండ‌వ్ వెబ్ సిరీస్ ‌పై ప‌లు రాజ‌కీయ‌, సామాజిక కార్య‌క‌ర్త‌లు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌గా, రీసెంట్‌గా ముంబై పోలీసులు కూడా తాండవ్ చిత్ర బృందంతో పాటు అమెజాన్‌పై కేసు కూడా న‌మోదు చేశారు. ఇక గురువారం రోజు ఉత్తర బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో తాండవ్‌కు వ్య‌తిరేఖంగా 100 మంది అఖిల్ భారతీయ విద్యా పరిషత్ సభ్యులు నిరసనలో పాల్గొన్న విషయం తెలిసిందే. జ‌నవరి 15న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన తాండవ్ వెబ్ సిరీస్‌లో డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ వంటి ఇతరులు ముఖ్య పాత్రల్లో నటించారు. డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా దీనికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

వెబ్ సిరీస్‌‌ తాండ‌వ్ కు వ్య‌తిరేకంగా గాడిద‌ల‌తో నిర‌స‌న‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts