డ్రాగన్ పండు పేరు మార్పు… ఎందుకంటే..!?

January 20, 2021 at 2:26 pm

మన దేశానికి పొరుగున ఉన్న చైనా అంటే చాలు మన మోడీ సర్కార్‌ భగ్గు మంటోంది. దేశ సరిహద్దుల వద్ద గొడవలు గానీ, యాప్‌ల నిషేధం ఇంకా వస్తువుల దిగుమతులు లాంటివి ఇలా ఒకటి ఏమిటి దాదాపు అన్నింటిలోనూ బిజెపి ప్రభుత్వం చైనా పేరు ఎత్తుతేనే చాలు విరుచుకు పడుతోంది. ఈ క్రమంలోనే చైనా ఫ్రూట్‌గా పేరు పొందిన డ్రాగన్‌ ఫ్రూట్‌ పేరును తనకు అనుకూలంగా మార్చుకుంది గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం.

ఆ ఫ్రూట్‌కు కమలంగా నామకరణం చేసింది. కమలం ఆకారంలో ఉండటంతో ఈ పేరుని ఫిక్స్ చేసినట్లు గుజారాత్‌ ముఖ్య మంత్రి విజరు రూపానీ తెలిపారు. ఇప్పటికే కమలం పేరుతో గుజరాత్‌లో బిజెపి పార్టీ కార్యాలయం కూడా ఉంది. అందులోనూ ప్రధాని మోడీ సైతం విదేశీ పంట అయినప్పటికీ అక్కడి రైతులు పండిస్తున్నారంటూ మన్‌కీబాత్‌లో ఈ పండును గురించి ప్రస్తావించడంతో ఈ పేరుకు మార్పు జరిగినట్లు తెలిసింది.

డ్రాగన్ పండు పేరు మార్పు… ఎందుకంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts