
పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఈ వ్యక్తి. ఇక పన్నెండు నెలల్లో చరిత్ర సృష్టించి ప్రపంచ కుబేరుడిగా పేరు పొందిన వ్యక్తి ఎలాన్ మాస్క్. ఇక ఇప్పుడు ఆయనకు రోజురోజుకు అభిమానులు సంఖ్యా పెరుగుతూనే ఉంది. అంతరిక్ష ప్రయోగ సంస్థ స్పెఎక్స్, విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా ద్వారా ఆయన టెక్ రంగంలో ఎవరికీ సాధ్యం కానీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇటీవల ఎలాన్ మాస్క్ పెట్టిన ట్వీట్లు కూడా కనకవర్షం కురిపిస్తున్నాయి. అయితే అతను ఏం ట్వీట్ పెట్టాడు అని ఆలోచిస్తున్నారా.
తాజాగా ఓ కంపెనీని పొగుడుతూ ఆయన చేసిన ట్వీట్ ఆ కంపెనీకి ఆయాచిత వరంగా మారింది. ఎలాన్ మస్క్ తన పెంపుడు కుక్క కోసమని ఇట్సీ అనే ఈ-కామర్స్ సంస్థ ద్వారా ఉన్నితో తయారు చేసిన ‘మార్షియన్ హెల్మెట్’ను ఆర్డరిచ్చారు. ఆ తరువాత.. మార్షియన్ హెల్మెట్ ఫొటోలు ట్వీట్ చేస్తూ..ఇట్సీ అంటే నాకు ఒకింత ఇష్టం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఇట్సీ షేర్ల ధర ఒక్కసారిగా దూసుకుపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో రికార్డ స్థాయిలో షేరు ధర 8 శాతానికి ఎగబాకింది.
Bought a hand knit wool Marvin the Martian helm for my dog
— Elon Musk (@elonmusk) January 26, 2021