పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్….!?

January 25, 2021 at 3:46 pm

EPFO తాజాగా తమ కస్టమర్స్ కి ఒక తీపి కబురు అందించింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ అకౌంట్ వడ్డీ మొత్తాన్ని కస్టమర్స్ పీఎఫ్ అకౌంట్లలో జమ చేయడాన్ని మొదలు పెట్టినట్టు ఈపీఎఫ్‌వో తెలిపింది. 6 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లకు 8.5 శాతం వడ్డీని చెల్లిస్తున్నామని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు వారి అకౌంట్లలో పీఎఫ్ వడ్డీ డబ్బులు పడ్డాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగుల వేతనం నుంచి 12 శాతం డబ్బులు పీఎఫ్ ఖాతాకు వెళ్తాయి. ఇదే మొత్తంలో డబ్బులను కంపెనీ కూడా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో డిపాజిట్ చేస్తుంది. ఇకపోతే పీఎఫ్ ఖాతాదారులు వారి ఈపీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ డబ్బులు వచ్చాయో లేదో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్‌వో వెబ్ ‌సైట్‌కు వెళ్లాలి.

ఇప్పుడు యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా సాయంతో లాగిన్ అయ్యి, ఈ పాస్‌ బుక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఖాతాలోకి వడ్డీ వచ్చిందో లేదో అక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీరు యాప్ డౌన్‌లోన్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌లోకి వెళ్లి అక్కడ పాస్ బుక్ ఆప్షన్ క్లిక్ చెయ్యాలి. యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాత మీరు మీ బ్యాలెన్స్ చూసు కోవచ్చు. కాబ్బటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకమీదట చాలా సులభంగా మీ బ్యాలెన్స్ ఎప్పుడు కావాల్నంటే అప్పుడు చూసు కోవచ్చు.

పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్….!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts