టాలీవుడ్‌లో విషాదం.. ఆ సీనియర్‌ నిర్మాత కన్నుమూత!

January 18, 2021 at 9:56 am

టాలీవుడ్‌లో తాజాగా మ‌రో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వి.ఎం.సి అధినేత వి.దొరస్వామిరాజు క‌న్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించగా.. కొంతకాలంగా బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.

అయితే ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విషమించి సోమ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలే పెళ్లాం ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

కాగా, ద‌ర‌స్వామి రాజు రాజకీయంగానూ రాణించారు. 1994లో నగరి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్‌ ప్రెసిడెంట్‌, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఇలా ఎన్నో పదవులను అలంకరించారు.

టాలీవుడ్‌లో విషాదం.. ఆ సీనియర్‌ నిర్మాత కన్నుమూత!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts