వెబ్ సిరీస్ పై ఎఫ్ఐఆర్ నమోదు..!!

January 18, 2021 at 2:12 pm

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇటీవల తాండవ్ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. దీని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేశారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, దీనిని బ్యాన్ చేయాలని రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే కాకుండా దీనికి వ్యతిరేకంగా బాయ్‌కాట్ తాండవ్ అని నినాదాలు కూడా వచ్చాయి.

ఈ వెబ్ సిరీస్‌లో హిందువులు పూజించే దేవుడు మహాశివుడిని కించపరిచే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, స్ట్రీమింగ్ సంస్థలు కావాలనే హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తున్నాయని అన్నారు. దీనిపై కొందరు రాజకీయ నాయకులు కూడా తాండవ్‌కు వ్యతిరేకంగా స్పందించారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ అమెజాన్‌ ప్రైమ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇలానే కొనసాగితే ఈ వెబ్ ‌సిరీస్‌కు బ్రెకులు పడటం పక్కా. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇంకా తెలియాలి.

వెబ్ సిరీస్ పై ఎఫ్ఐఆర్ నమోదు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts