
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ఉన్నఅన్ని విద్యాసంస్థలు క్లోజ్ అయ్యాయి. కరోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా తగ్గకపోవడంతో విద్యార్ధులకు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు అందరు. కాగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ విద్యార్ధులు మాత్రం ఆన్లైన్ పాఠాలకే ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలోని విద్యార్థులందరికీ రోజుకు 2జీబీ చొప్పున మొబైల్ డేటాను ఫ్రీగా ఇవ్వనున్నట్లు తమిళనాడు సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి ప్రకటించారు. విద్యార్థులు ఈ రోజు నుంచి వచ్చే ఏప్రిల్ చివరి వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.దీని ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లాభం చేకూరుతుందని సీఎం చెప్పారు. డేటా కార్డులను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా అందించనున్నారు. ఇకమీదట ఆన్లైన్ పాఠాలు వినడానికి విద్యార్థులంతా ఉచిత మొబైల్ డేటాను ఉపయోగించుకోవాలని సీఎం పళనిస్వామి కోరారు.