బిగ్ బి అమితాబ్‌ సెక్సిస్ట్‌ వ్యాఖ్యల పై దుమారం..!!

January 22, 2021 at 4:19 pm

మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నపటికీ వారి అందం, సామర‍్ధ్యం పై నిత్యం కమెంట్స్‌, అనుచిత వ్యాఖ్యలు నిరంతరం మనం చూస్తూనే వస్తున్నాం. ఇలా వ్యాఖలు చేసే వారిలో మాములు వ్యక్తుల నుంచి సూపర్‌ ‌స్టార్లు, హీరోలు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు బిగ్అ బి అమితాబ్ బచ్చన్‌ తాను హోస్ట్ చేసే కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో వివక్షా పూరితమైన వ్యాఖ్య ఒక్కటి చేశారు. దీంతో ఈ విషయం పై ట్విటర్‌లో దుమారం రేగుతోంది. తన షోలో భాగంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చీఫ్‌ ఎకనామి​స్ట్‌గా ఉన్న గీతా గోపీనాథ్‌కు సంబంధించిన ప్రశ్నను ఒక మహిళా కంటెస్ట్‌కు అడిగారు అమితాబ్‌. 2019నుండి గీతా గోపీనాథ్‌ ఏ సంస్థకు ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్నారనే ప్రశ్నను అమితాబ్ అడిగారు. ఇంత వరకు ఓకే కానీ అక్కడే ఆయన తన నైజాన్ని చూపెట్టారు. గీతా ఫోటోను కంప్యూటర్ తెరపై చూపిస్తూ చాలా ఈజీగా కొన్ని అనుచిత కామెంట్స్ చేశారు.

ఆమె ఫేస్‌ ఎంత అందంగా ఉంది కానీ ఆర్థిక వ్యవస్థతో ఆమె అందాన్ని జోడించి ఎవరైనా చూడగలమా అంటూ అమిటాబ్ జి వ్యాఖ్యానించారు. తాజాగా దీనికి సంబంధించిన ఈ వీడియోను గోపీనాథ్ స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అమితాబ్‌ వ్యాఖ్యలపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, బాలీవుడ్‌ సూపర్ ‌స్టార్‌ అమితాబ్‌కు తాను పెద్ద వీర అభిమానిననీ తనకు ఈ వీడియో చాలా ప్రత్యేకమైనధీ అంటూ ట్వీట్ చేయడం విశేషం. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ ఆమె వర్ణించారు. కానీ అమితాబ్ సెక్సిస్ట్‌ కామెంట్స్ పై ట్విటర్‌ యూజర్లు మాత్రం చాలా మండి పడుతున్నారు. నెటిజన్స్ అంత ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ బిజినెస్‌ ఛానల్‌ యాంకర్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌ లతా వెంకటేష్‌ సహా పలువురు ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. గీతా గోపీనాథ్‌ సాధించిన గౌరవాన్ని ఏమాత్రం గుర్తించకుండా, ఆమె అందాన్ని ప్రస్తావించడం చాలా బాధకారమంటూ విమర్శిస్తున్నారు.

బిగ్ బి అమితాబ్‌ సెక్సిస్ట్‌ వ్యాఖ్యల పై దుమారం..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts