కర్నూలు ప్రజలకు శుభ వార్త..!?

January 17, 2021 at 2:19 pm

కర్నూలు జిల్లా ఓర్వకల్‌ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు కీలకమైన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ అనుమతి ఇచ్చింది. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతిస్తూ జనవరి 15న డీజీసీఏ ఉత్తర్వులిచ్చినట్టు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. విమానాశ్రయం పై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వేగంగా నిధులు మంజూరు చేయడంతో తక్కువ సమయంలోనే కీలకమైన అనుమతులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి మరింత ముందుకెళ్లడంతో పాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు.

ఇదిలా ఉండగా విమానాలు నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ ఒప్పందం కుదిర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నుంచి విమానాలు నడిపేందుకు సంస్థ సిద్ధం అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి గత ఏడాది దసరా పండుగకు విమానాలు నడుపాలని ప్రభుత్వం అనుకున్న అది సాధ్యపడలేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి అయినా వీలు కావడం లేదు. విమానాలు సర్దుబాటు చేయడం కష్టమని, మార్చి నుంచి నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉడాన్‌ పథకం కింద కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడిపేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఈ మార్గాల్లో కేవలం ఇండిగో సంస్థకు మాత్రమే కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అనుమలు జారీ చేసింది. అలాగే మరికొన్ని రూట్లలో సర్వీసలు నడిపేందుకు రాష్ట్ర విమానాయాన అభివృద్ధి సంస్థ స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌తో చర్చలు జరుపుతోంది. కాబ్బటి అతి త్వరలోనే కర్నూలులో విమానా సర్వీసులు నడువనుండడంతో అక్కడ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు ప్రజలకు శుభ వార్త..!?
0 votes, 0.00 avg. rating (0% score)