నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే బోర్డు…!?

January 12, 2021 at 5:26 pm

నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని రైల్వే బోర్డు ప్రకటించింది. రైల్వే బోర్డు కొత్త సీఈవో సునీత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. అసిస్టెంట్ లోకోపైలట్లుగా ఎంపికైన అభ్యర్థులు త్వరలో పిలుపును అందుకుంటారు అని అన్నారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా శిక్షణ ఇవ్వడంలో లేట్ అయిందని, ఈ అసౌకర్యానికి చాలా చింతిస్తున్నామన్నారు ఆయన. డిసెంబర్ నుంచి రైల్వే బోర్డు పరిధిలోని అన్ని శిక్షణా కేంద్రాలలో శిక్షణ మొదలయింది అన్నారు. ఇదిలా ఉంటే, గతేడాది లక్షా 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయగా, రెండు లక్షలకు మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా నిలిచిన పరీక్షలను డిసెంబర్ నుంచి నిర్వహిస్తామని సునీత్ శర్మ తెలిపారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే బోర్డు…!?
0 votes, 0.00 avg. rating (0% score)