రాశీకి నో చెప్పిన గోపీచంద్‌..!

January 20, 2021 at 2:13 pm

టాలీవుడ్ ప్రముఖ డైరెక్ట‌ర్ మారుతి మాస్‌ మహారాజా ర‌వితేజ‌తో సినిమా చేయాల‌ని భావించిన సంగతి తెలిసిందే. అయితే ర‌వితేజ‌తో ప్లాన్ వ‌ర్క‌వుట్ కాకపోవటంతో ఈ ప్రాజెక్టును గోపీచంద్ తో క‌లిసి చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ఈ సినిమాలో రాశీఖ‌న్నాను హీరోయిన్ గా సెలెక్ట్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు కానీ హీరో గోపీచంద్ మాత్రం రాశీఖ‌న్నాతో చేయడానికి రెడీగా లేడ‌ట‌. గతంలో గోపీచంద్‌ రాశీఖ‌న్నా కాంబినేషన్ లో జిల్‌, ఆక్సిజ‌న్ చిత్రాలు వ‌చ్చాయి.

కానీ ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ దగ్గర పెద్ద ప్లాప్ గా నిలిచాయి. ఇంకా రాశీఖ‌న్నా నటించిన శ్రీనివాస క‌ల్యాణం, అయోగ్య‌, వెంకీమామ‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ వెంకీ మామ చిత్రాలు ఆశించినంత విజ‌యాన్ని అందుకో లేక‌పోయాయి. ఇటువంటి ప‌రిస్థితుల్లో రాశీఖ‌న్నాను ఎంపిక చేయ‌డం స‌రైంది కాద‌ని అనుకున్నట్టు ఉన్నాడు గోపీచంద్ దానితో ఆమెతో న‌టించ‌డానికి నో చెప్పాడ‌ని ఫిలింన‌గ‌ర్ లో టాక్ వినిపిస్తుంది. దీంతో మూవీ మేక‌ర్స్ మ‌రో హీరోయిన్ ను వెతికే పనిలో ప‌డిన‌ట్టు సమాచారం.

రాశీకి నో చెప్పిన గోపీచంద్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts