గొరిల్లాలకు కరోనా పాజిటివ్… ఎక్కడంటే…!?

January 12, 2021 at 5:46 pm

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మనుషులతో పాటు అనేక మూగజీవులు కూడా కరోనా వైరస్ సోకింది. అయితే తాజాగా అమెరికాలో మొట్ట మొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్‌లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించగా గొరిల్లాలకు కరోనా పాజిటివ్ అని తేలింది. జూ సిబ్బందిలోని ఓ వ్యక్తి ద్వారానే గొరిల్లాలకు కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తి గొరిల్లాల వద్దకు వెళ్లిన ప్రతిసారి మాస్క్ ధరించినప్పటికీ కరోనా సోకిందని వారు తెలిపారు.

కరోనా పరీక్షల్లో ఆ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతని ద్వారానే కరోనా సోకినట్టు నిర్థారించారు. ఇప్పటివరకు గొరిల్లాలకు ఎటువంటి వైద్యం అందించలేదని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ వస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు కాలిఫోర్నియా ప్రభుత్వం డిసెంబర్ ఆరో తేదీ నుంచి లాక్‌డౌన్ విధించిన క్రమంలో అప్పటి నుంచి ఈ జూను కూడా అధికారులు మూసి ఉంచారు.

గొరిల్లాలకు కరోనా పాజిటివ్… ఎక్కడంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts