సినిమాల‌ను అందుకే వ‌దిలేశా.. ఒక‌ప్ప‌టి యూత్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌!

January 21, 2021 at 10:37 am

ఒక‌ప్ప‌టి యూత్ హీరో అబ్బాస్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ముఖ్యంగా అబ్బాస్ హెయిర్ స్టైల్ అప్ప‌ట్లో ఓ ట్రెండ్‌. 1996లో `ప్రేమ దేశం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అబ్బాస్‌.. మొద‌టి మూవీతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ త‌ర్వాత కూడా బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలు చేసిన అబ్బాస్‌.. ఫుల్ పాపులర్ అయ్యాడు.

ఇక కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. రజినీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేశాడు అబ్బాస్‌. అయితే యూత్ లో ఎంతో క్రేజ్ ను సంపాధించిన అబ్బాస్..కెరీర్ గ్రాఫ్ స‌డెన్ గా ప‌డిపోయింది. ఏ సినిమా చేసినా.. హిట్ ల‌భించేది కాదు.

ఇలాంటి త‌రుణంలో ఆయ‌న పూర్తిగా సినిమాల‌కు దూరం అయిపోయారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అబ్బాస్‌.. ఎందుకు సినిమాల‌ను వ‌దిలేశాడో క్లారిటీ ఇచ్చాడు. ఆయ‌న మాట్లాడుతూ.. బాగా బోర్ కొట్టేసి నటనకు స్వస్తి చెప్పానని, పాత్రలో, నటనలో మనసు పెట్టలేనప్పుడు నటనకు న్యాయం చేయలేనని అనిపించి బయటికి వచ్చేశానని అబ్బాస్ తెలిపాడు.

సినిమాల‌ను అందుకే వ‌దిలేశా.. ఒక‌ప్ప‌టి యూత్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts